గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు వెల్లడించవద్దు

సాక్షి, అమరావతి: గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను వెల్లడించవద్దని ఏపీపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది.
Edu newsఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజని సెప్టెంబర్ 30న ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీపీఎస్సీని ఆదేశించి తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు. 169 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం 2018, డిసెంబర్ 31న ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ పరీక్షల్లో లోపాలపై షేక్ షానవాజ్, మరో 14 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది బి.రచనారెడ్డి వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను నాలుగు వారాల పాటు వెల్లడించవద్దని, డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏవో) గ్రేడ్-2 పరీక్షా ఫలితాలను కూడా ప్రకటించవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
Tags:
Group-1 Priliminary Results APPSC High Court Orders Divisional Account Officer(DAO) Grade-2 Results
Published on 10/1/2019 3:55:00 PM

Related Topics