Sakshi education logo
Sakshi education logo

ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 సిలబస్‌లో తాజా మార్పులు...

Join our Community

facebook Twitter Youtube
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌–2 సర్వీసెస్‌కు సంబంధించి స్క్రీనింగ్‌ టెస్ట్, మెయిన్‌ ఎగ్జామినేషన్‌ విధానంలో పేపర్లు, మార్కుల పరంగా ఎలాంటి మార్పులు లేకపోయినప్పటికీ..
Jobs Images ఆయా విభాగాలకు సంబంధించి నిర్దేశించిన సిలబస్‌ అంశాల్లో మార్పులు జరిగాయి.

స్క్రీనింగ్‌ టెస్ట్‌ :
గత నోటిఫికేషన్‌లో స్క్రీనింగ్‌ టెస్ట్‌ను జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ పేరుతో 150 మార్కులకు నిర్వహించారు. అప్పుడు కేవలం మూడు విభాగాలు(కరెంట్‌ అఫైర్స్‌; కాన్‌స్టిట్యూషన్, ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా)గానే పరీక్ష ఉంది. కానీ... కొత్త సిలబస్‌ ప్రకారం.. స్క్రీనింగ్‌ టెస్ట్‌ను మూడు సెక్షన్లుగా మార్పు చేశారు. సెక్షన్‌–ఎను జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ; సెక్షన్‌–బి సోషల్‌ అండ్‌ కల్చరల్‌ హిస్టరీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్, భారత రాజ్యాంగం; సెక్షన్‌–సిని ప్లానింగ్‌ అండ్‌ ఎకానమీగా నిర్దిష్టంగా పేర్కొన్నారు. వీటిలో కరెంట్‌ అఫైర్స్, ప్లానింగ్‌ అండ్‌ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్‌ ప్రాధాన్యంగా అంశాలను నిర్దేశించారు.

గ్రూప్‌–2 మెయిన్స్‌ :
గ్రూప్‌–2 మెయిన్‌ ఎగ్జామినేషన్‌ గతంలో మాదిరిగానే మూడు పేపర్లుగా.. ఒక్కో పేపర్‌కు 150 మార్కులు చొప్పున 450 మార్కులకు నిర్వహించనున్నారు. అయితే వీటిలోనూ సిలబస్‌ పరంగా మార్పులు చేశారు. పేపర్‌–1లో జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీపై పరీక్ష ఉంటుంది.
పేపర్‌–2: ఆంధ్రప్రదేశ్‌ సామాజిక, సాంస్కృతిక చరిత్ర; భారత రాజ్యాంగం అంశాలు పొందుపరిచారు.
పేపర్‌–3: ప్లానింగ్‌ అండ్‌ ఎకానమీలో.. భారత, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి ప్రణాళికలు, కోర్‌ ఎకానమీ సంబంధిత అంశాలు పొందుపరచారు. ఆంధ్రప్రదేశ్‌ ఎకానమీకి సంబంధించి బడ్జెట్‌ వనరులు–పరిమితులు, ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలోని షరతులను పూర్తిచేయడం–ఈ విషయంలో కేంద్ర సహకారం–సమస్యలు; ప్రాజెక్ట్‌ ఆఫ్‌ ఎక్స్‌టర్నల్‌ అసిస్టెన్స్‌ వంటి అంశాలను ప్రత్యేకంగా కొత్తగా చేర్చారు.

సిలబస్‌ పరిశీలన..
రానున్న నోటిఫికేషన్ల పరీక్షలు కొత్త సిలబస్‌ ప్రకారమే జరగనున్నాయి. అభ్యర్థులు ఇప్పటి నుంచే తమ ప్రిపరేషన్‌ శైలి పరంగా వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. సిలబస్‌ ఆసాంతం అవగాహన చేసుకుని.. పాత సిలబస్‌ ప్రకారం ఇప్పటి వరకు చదివిన అంశాలు, కొత్త సిలబస్‌లో వాటికి కల్పిస్తున్న వెయిటేజీని గమనించాలి. దీనికి అనుగుణంగా కొత్త సిలబస్‌లో ప్రత్యేకంగా దృష్టిపెట్టాల్సిన అంశాలను గుర్తించి వాటి కోసం ప్రత్యేక సమయం కేటాయించాలి. గ్రూప్‌–1, గ్రూప్‌–2 సిలబస్‌లను పరిగణనలోకి తీసుకుంటే.. దాదాపు 80 శాతం అంశాలు ఒకే మాదిరిగా ఉన్నాయి. అభ్యర్థులు గ్రూప్‌–1 ఓరియెంటేషన్‌తో.. డిస్క్రిప్టివ్‌ అప్రోచ్‌తో దీర్ఘకాలిక ప్రిపరేషన్‌తో ముందుకు సాగితే గ్రూప్‌–2 సిలబస్‌పైనా పట్టు సాధించే అవకాశం ఉంది. ఆయా అంశాలను చదివేటప్పుడు వాటిని సమకాలీన అంశాలతోనూ సమన్వయం చేసుకుంటూ డిస్క్రిప్టివ్‌ విధానంలో ప్రిపరేషన్‌ సాగిస్తే.. కోర్‌ సబ్జెక్ట్‌ నైపుణ్యంతోపాటు సమకాలీన పరిస్థితుల్లో అన్వయించే నైపుణ్యం లభిస్తుంది.

గ్రూప్‌–2 పరీక్ష విధానం :
మొదటి దశ:
స్క్రీనింగ్‌ టెస్ట్‌
పేపర్‌ అంశం మార్కులు
  ఎ. జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ. 
బి. ఆంధ్రప్రదేశ్‌ సామాజిక,సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం.
సి. ఆర్థిక వ్యవస్థ ప్రణాళికలు
150
 
రెండో దశ: మెయిన్స్‌
పేపర్‌ అంశం మార్కులు
పేపర్‌–1 జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ 150
పేపర్‌–2 సెక్షన్‌–1: 
ఆంధ్రప్రదేశ్‌లోని సామాజిక, సాంస్కృతిక చరిత్ర
సెక్షన్‌–2:
భారత రాజ్యాంగం
150
పేపర్‌–3 ప్రణాళికలు ఆర్థిక వ్యవస్థ 150
మొత్తం మెయిన్స్‌ మార్కులు 450
Published on 1/1/2019 2:00:00 PM

Related Topics