Sakshi education logo
Sakshi education logo

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చరిత్ర, నిర్మాణం, విధులు

Join our Community

facebook Twitter Youtube
Education Newsచరిత్ర
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందు ఆంధ్రరాష్ట్రంలో ఆంధ్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్, హైదరాబాద్ రాష్ట్రంలో హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ అనే రెండు సంస్థలు వేరువేరుగాఉద్యోగ నియామకాలు చేపట్టేవి. ఆంధ్రరాష్ట్రం, హైదరాబాద్‌లు కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (Andhra Pradesh Public Service Commission) ఏర్పాటైంది. ఇది 1956 నవంబర్ 1 నుంచి అమలులోకి వచ్చింది.

కమీషన్ ఏర్పాటయ్యేనాటికి ఆంధ్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్‌లో ఒక చైర్మన్, ఇద్దరు సభ్యులు ఉండగా, హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమీషన్‌లో ఒక చైర్మన్, ఒక సభ్యుడు మాత్రమే ఉండేవారు. కాబట్టి 1956లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఒక చైర్మన్, ముగ్గురు సభ్యులతో ఏర్పాటైంది. 1981లో సభ్యుల సంఖ్యను 5 కు పెంచగా 1983లో 7 కు పెంచారు. పని ఒత్తిడి, నియామకాల సంఖ్య పెరగటంతో ఈ సంఖ్యను 1994లో 9 కి పెంచారు. ప్రస్తుత కమీషన్‌లో ఒక చైర్మన్, 9 మంది సభ్యులున్నారు.

ప్రస్తుత కమీషన్ చైర్మన్ - పి. ఉదయ భాస్కర్

కమీషన్ నిర్మాణం
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఒక రాజ్యాంగపరమైన సంస్థ. రాజ్యాంగంలోని 14వ భాగంలో అధికరణ 315 నుంచి 323 వరకు కమీషన్ నిర్మాణం, విధుల గురించి తెలుపుతాయి.
 • అధికరణ 315 ప్రకారం రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్‌లో ఒక చైర్మన్ మరియు రాష్ట్ర గవర్నర్ నిర్ణయించిన సంఖ్యలో ఇతర సభ్యులుంటారు (సభ్యుల సంఖ్యకు సంబంధించి రాజ్యాంగలో ప్రస్తావన లేదు). చైర్మన్, సభ్యులను గవర్నరు నియమిస్తారు. వీరి పదవీకాలం 6 సంవత్సరాలు లేదా పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలు ఏది ముందైతే దానిని పరిగణనలోకి తీసుకుంటారు. మౌలిక రాజ్యాంగలో సభ్యుల పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాలుగా ఉండేది. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా దానిని 62 సంవత్సరాలకు పెంచారు.
 • చైర్మన్, సభ్యులను నియమించడానికి ప్రత్యేకమైన అర్హతలు రాజ్యాంగంలో పేర్కొనలేదు. కానీ మొత్తం సభ్యుల్లో సగం మందిని కేంద్ర రాష్ట్ర పరిపాలనా సర్వీసుల్లో అనుభవం ఉన్న వారిని నియమించాలి. మిగిలిన సగం మందిని రాష్ట్ర ప్రభుత్వం విచక్షణ మేరకు వివిధ రంగాల్లో అనుభవం ఉన్న వారిని నియమించుకోవచ్చు.
 • కమీషన్ చైర్మన్, సభ్యులను కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ తరహాలోనే తొలగిస్తారు. అవినీతి (Corruption), అసమర్థత(Incapable), దివాళాతీయడం (Insolvent) వంటి కారణాలపైన సుప్రీం కోర్టు న్యాయమూర్తి చేత విచారణ జరిపించి, రాష్ట్రపతి తొలగిస్తారు. అయితే గవర్నరుకు వీరిపై వచ్చిన అభియోగాలు నిరూపితం అయ్యే వరకు సస్పెండ్ చేసే అధికారం ఉంటుంది కానీ తొలగించే అధికారం లేదు.
 • చైర్మన్, సభ్యులు తమ రాజీనామా పత్రాలను గవర్నరుకు సమర్పిస్తారు.
 • వీరి జీతభత్యాలను రాష్ర్టపతి నిర్ణయిస్తారు. వీటిని రాష్ట్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.

కమీషన్ అధికారాలు - విధులు
రాష్ట్ర సర్వీసుల్లో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, ఇతర ఉద్యోగాల నియామకాలకు పోటీ పరీక్షలు (Competitive Exams)నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.
 • వివిధ సాంకేతిక శాఖలలో ఇంజనీర్ల నియామకాలు చేపడుతుంది.
 • 13 జిల్లాల్లో ఉద్యోగులకు సంబంధించిన శాఖాపరమైన పరీక్షలు (Departmental Tests) నిర్వహిస్తుంది.
 • ఐఏఎస్, ఐపీఎస్‌లకు అర్ధవార్షిక పరీక్షలు ((Half Yearly Exams)) నిర్వహిస్తుంది.
 • ప్రభుత్వ సర్వీసులకు సంబంధించిన నియామకాలు (Recruitments), పదోన్నతులు (Promotions), బదిలీలు (Transfers), క్రమశిక్షణా చర్యలు(Disciplinary cases) వంటివాటిపైన ప్రభుత్వానికి సలహాలిస్తుంది.
 • అధికరణ 323 ప్రకారం కమీషన్ తన వార్షిక నివేదికను గవర్నరుకు సమర్పిస్తుంది.

కమీషన్ విధులను తెలిపే అధికరణలు
 1. పత్యక్ష నియామకాలు (Direct Recruitment (అధికరణ 320 (1))
 2. బదిలీల ద్వారా నియామకాలు (Recruitment by transfer (అధికరణ320(3)(b))
 3. సర్వీసు నియమ నిబంధనలు (Statutory rules relating to services (అధికరణ320 (3)(a)&(b)
 4. కమశిక్షణా చర్యలు, నిబంధనలు (Disciplinary cases (అధికరణ320(3) and regulations 17(1)(a) to (e))

మరికొన్ని విశేషాలు
 • కమీషన్ నిర్వహించే ఒకటి లేదా రెండింటికి తప్ప అన్ని పోటీ పరీక్షలకు రాత పరీక్షలను తప్పనిసరి చేశారు. మిగిలిన వాటికి కేవలం మౌఖిక పరీక్ష నిర్వహిస్తారు.
 • రెండు లేదా అంతకంటే ఎక్కువ ఇంటర్వ్యూ బోర్డులు ఉన్నప్పుడు అభ్యర్థులు తమను ఏ బోర్డు ఇంటర్వ్యూ చేయాలో నిర్ణయించుకునే స్వేచ్ఛను కల్పించారు. దీని కోసం సీల్డ్ కవర్ విధానం ప్రవేశపెట్టారు.
 • మౌఖిక పరీక్ష (Oral Test) కు 12.5 శాతం మార్కులు కేటాయించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. అయితే రాత పరీక్షకు ప్రాధాన్యత పెంచడానికి వాటిని 10 శాతానికి తగ్గించారు.
 • సమర్థవంతమైన పరిపాలకునికి ఉండాల్సిన లక్షణాలు లేదా నైపుణ్యాలను నిపుణుల కమిటీ గుర్తించి వాటిని కలిగిన వారినే ఎంపిక చేసేలా సిలబస్‌ను రూపొందించమని కమీషన్‌కు సిఫారసు చేసింది.

ఉత్తమ పరిపాలకునికి ఉండాల్సిన నైపుణ్యాలు
 • సమస్య విశ్లేషణ, పరిష్కార సూచన నైపుణ్యం కలిగి ఉండటం (Problem analysis and suggestion of solutions.)
 • సమాజం, ఆర్థిక వ్యవస్థ పై తగిన పరిజ్ఞానం ఉండటం(Knowledge of society and the economy)
 • సాంకేతికతపై కనీస అవగాహన కలిగి ఉండటం (Awareness of technology and its potentiality.)
 • పరిమాణాత్మక నైపుణ్యం, మానసిక సామర్థ్యం కలిగి ఉండటం (Quantitative skills and mental ability.)
 • రాజ్యాంగం, చట్టం, ప్రజా పరిపాలన పరిజ్ఞానం కలిగి ఉండటం (Knowledge of Constitution, Law and Public Administration.)

అన్ని పరీక్షలకు ఒకే నమోదు
 • 2016లో ఏపీపీఎస్సీ వన్‌టైం రిజిస్ట్రేషన్ (One TimeRegistration) అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానంలో అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో ఒకసారి నమోదుచేసుకుంటే ఒక శాశ్వత రెఫరెన్స్ నంబర్ వస్తుంది. దీని ద్వారా భవిషత్తులో జరిగే అన్ని పరీక్షలకు సులువుగా దరఖాస్తు చేయవచ్చు.
 • ఇప్పటి వరకు ఆఫ్‌లైన్ లో జరిగే పరీక్షలు ఇకనుంచి ఆన్‌లైన్‌లో జరగనున్నాయి.

ఏపీపీఏస్సీ పోస్టుల వివరాలు
ఏపీపీఎస్సీ కింద తెలిపిన సర్వీసులకు ఉద్యోగ నియామకాలు చేపడుతుంది. గ్రూప్స్‌తో పాటు ఇతర చాలా టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉద్యోగాలకు కూడా పరీక్షలు నిర్వహిస్తోంది.

Group-I
 1. Deputy Collectors in A.P. Civil Service (Executive Branch)
 2. Commercial Tax Officers in A.P. Commercial Taxes Service.
 3. Deputy Supdt. of Police (Civil) Cat-2 in A.P. Police Service
 4. Deputy Supdt. of Jails (MEN) in A.P. Jail Service
 5. Divisional Fire Officers in Fire & Emergency Services
 6. District Registrar in A.P. Registration and Stamps Service
 7. District Tribal Welfare Officer in A.P. Tribal Welfare Service.
 8. District Employment Officer in Employment Service
 9. Asst. Treasury Officer/Asst. Accounts Officer in A.P. Treasury & Accounts Service.
 10. Deputy Registrar in A.P. Cooperative Service
 11. District Panchayat Raj Officers in Panchayat Raj Service.
 12. Regional Transport Officers in A.P. Transport Service
 13. District Social Welfare Officer in A.P. Social Welfare Service.
 14. District B.C. Welfare Officer in B.C. Welfare Service
 15. Municipal Commissioner Grade-II in A.P. Municipal Administration Service
 16. Mandal Parishad Development Officer in A.P. Panchayat Raj and Rural Development Service
 17. Lay Secretary / Administrative Officer in Medical and Health
 18. Assistant Prohibition & Excise Superintendent in A.P. Prohibition & Excise Service
 19. Assistant Audit Officer in A.P. Local Fund Audit Service.

Group-II
  Executive Posts
 1. Asst. Commercial Tax Officer in A.P. Commercial Taxes Sub-Service
 2. Assistant Labour Officer in A.P. Labour & Employment Sub-Service
 3. Executive Officer Grade-I in A.P. Endowments Sub-Service
 4. Deputy Tehsildar (Mandal Revenue Officer) in AP Revenue Sub Service 
 5. Assistant Development Officer in A.P. Handlooms and Textiles Sub Service
 6. Municipal Commissioner Gr-III in AP Municipal Commissioner Sub Service
 7. Prohibition & Excise Sub Inspector in A.P. Prohibition & Excise Sub-Service
 8. Sub-Registrar Grade-II in A.P Registration Sub -ordinate Service
 9. Extension Officer in PR & RD Department
  Non Executive Posts
 10. Assistant Section Officer in A.P. Secretariat Sub. Service
 11. Assistant Section Officer (Finance Dept.,) in A.P. Secretariat Sub. Service
 12. Senior Accountant in A.P. Treasuries & Accounts (District Sub Service.
 13. Senior Accountant in A.P. Treasuries & Accounts (HOD) Sub Service
 14. Assistant Section Officer (Legislature Dept.,) in A.P. Legislature Secretariat Service
 15. Senior Auditor in A.P. State Audit Subordinate Service
 16. Junior Accountant in various Department in A.P Treasuries & Accounts Sub-Service
 17. Junior Assistants in APPSC
 18. Junior Assistants in Civil Supplies
 19. Junior Assistants in Commissioner of Technical Education
 20. Junior Assistants in Commissioner of Transport Department
 21. Junior Assistants in Commissioner of Labour
 22. Junior Assistants in Fire & Emergency Service
 23. Junior Assistants in PH & ME Dept.
 24. Junior Assistants in Engineer-in-Chief, RWS&S Dept.
 25. Junior Assistants in A.P. Police Academy
 26. Junior Assistants in Director of Government Examinations
 27. Junior Assistant in Commissioner of Social Welfare
 28. Junior Assistant in Commissioner of Industries
 29. Junior Assistants in Engineer in Chief, Roads & Buildings
 30. Junior Assistants in Chief Electrical Inspectorate
 31. Junior Assistant in Survey Settlement Department  
 32. Junior Assistants in Forest Department
 33. Junior Assistant in A.P Civil Supplies Department
 34. Junior Assistants in Director of B.C. Welfare Department
 35. Junior Assistant in A.P Anti Corruption Bureau)
 36. Senior Accountant in A.P Insurance (Directorate)
 37. Senior Accountant In Insurance A.P.G.L.I Sub-Service etc.
Group-III
Panchayat Secretary (Grade-IV)

Group-IV
Junior Accountants in Treasures and Accounts subordinate service
Junior Assistants in Registration and Stamps Department
Junior Assistants from CCLA
Junior Assistants from Prisons and Correctional Department
Junior Assistants in Social Welfare Department.
Junior Assistants in Fire Department

Other Posts (Technical)
Assistant Chemical Examiners
Assistant Commissioner Endowments
Assistant Conservator of Forests
Assistant Director of Horticulture
Assistant Director of Marketing
Assistant Director of Mines
Assistant Director of Survey
Assistant Electrical Inspector
Assistant Engineers
Assistant Executive Engineers-Civil
Assistant Executive Engineers-Civil & Agriculture
Assistant Executive Engineers-Civil & Electrical
Assistant Executive Engineers-Civil & Mechanical
Assistant Executive Engineers-Civil & Mechanical & Electrical
Assistant Geologist
Assistant Inspector of Fisheries
Assistant Public Relations Officer
Assistant Sericulture Officer
Assistant Statistical Officer
Assistant Tribal Welfare Officer
Forest Range Officers
Forest Section Officers
Forest Beat Officers
Tanadar/Bungalow Watcher/Plantation Watcher
Civil Assistant Surgeons in Preventive Medicine
Civil Assistant-Surgeons
Degree Lecturers
Dental Assistant Surgeons
Deputy Inspector Survey
Deputy Surveyors
Divisional Accounts Officers
Drug Inspectors
English Reporters
Executive Officers Grade-III
Fisheries Development Officer
Food Inspectors
Graduate Librarians
Inspector of Boilers
Inspector of Legal Metrology
Inspector of Factories
Librarians in Degree colleges
Managers in MWS&SB
Polytechnic lecturers
Port Officers
Research Assistant
Sr/Jr Marketing Assistants
Senior Reporters
Technical Assistant Geophysics
Technical Assistant Mining
Zilla Sainik Welfare Officers
Museum Curators
Published on 7/26/2016 5:04:00 PM

Related Topics