తెలంగాణ ఎంసెట్, ఈసెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు

సాక్షి, హైదరాబాద్: కోవిడ్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) దరఖాస్తుల గడువును పొడిగించేందుకు ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది.
Education Newsఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యార్థులు ఇళ్ల నుంచి ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్లి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వీలులేదని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు.

తెలంగాణ ఎంసెట్- 2020 ఆన్‌లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్, స్టడీ మెటీరియల్, గెడైన్స్... ఇతర ఆప్‌డేట్స్ కొరకు క్లిక్ చేయండి.

ఈ క్రమంలో ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 28తో ముగియనున్న ఎంసెట్ ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువును ఏప్రిల్ 7 వరకు, ఈసెట్ దరఖాస్తుల గడువును ఏప్రిల్ 5 వరకు పొడిగించినట్లు వివరించారు. కాగా, ఎంసెట్ రాసేందుకు దరఖాస్తు చేసుకు న్న విద్యార్థుల సంఖ్య లక్షన్నర దాటింది. మంగళవారం సాయంత్రం వరకు మొత్తంగా 1,50,351 మంది దరఖాస్తు చేసుకున్నారు.
Published on 3/26/2020 6:05:00 PM

Related Topics