ఆ పోస్టుకు రాత పరీక్ష పాసైతే చాలు !

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 2.70 లక్షల గ్రామ, వార్డు వలంటీర్ల ఉద్యోగాలు, 1.26 లక్షలకుపైగా అనుబంధ కొలువులు, 7,966 లైన్‌మెన్ ఉద్యోగాలు వెరసి రికార్డు స్థాయిలో 4 లక్షలకుపైగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలకు యువత నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది.
Education Newsగ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు గత జూలై 26వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 11న అర్ధరాత్రితో ముగియగా గడువు ముగిసే సమయానికి 22,73,793 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే లక్ష మందికి పైగా దరఖాస్తు ఫీజు చెల్లించని కారణంగా 21,69,719 మందే రాతపరీక్షకు అర్హత పొందారు. దరఖాస్తు చేసుకుంటే ఉద్యోగం! ఒకవైపు ‘సచివాలయ’ ఉద్యోగాలకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు అందగా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ పోస్టు అభ్యర్థులు మాత్రం రాత పరీక్షలో కనీస మార్కులు సాధిస్తే చాలు కొలువు సొంతం చేసుకునే పరిస్థితి నెలకొంది. ఈ పోస్టుకు చాలా తక్కువ మంది దరఖాస్తు చేసుకోవటమే దీనికి కారణం. గ్రామ సచివాలయాల్లో 9,886 పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయగా కేవలం 6,265 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. మిగిలిన 18 రకాల ఉద్యోగాలకు తీవ్ర పోటీ నెలకొంది. ఒక్కో ఉద్యోగానికి గరిష్టంగా సరాసరిన 35 మంది పోటీ పడుతున్నారు.

సాధారణ డిగ్రీ ఉద్యోగాలకు భారీ పోటీ :
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల్లో కేటగిరీ -1లో పేర్కొన్న పంచాయితీ కార్యదర్శి గ్రేడ్-5, మహిళా పోలీసు, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, వార్డు ఆడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ లాంటి నాలుగు రకాల ఉద్యోగాలకు సాధారణ డిగ్రీని కనీస విద్యార్హతగా పేర్కొన్నారు. ఈ కేటగిరీలో మొత్తం 36,449 ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేస్తుండగా రాష్ట్రవ్యాప్తంగా 12,54,034 మంది రాత పరీక్షకు అర్హత సాధించారు.

పరీక్ష

ఉద్యోగాల వివరాలు (ఉమ్మడిగా పరీక్ష నిర్వహించేవి)

భర్తీ చేసే పోస్టులు

పరీక్షకు అర్హత సాధించినవారు

కేటగిరీ-1

  1. పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-5,
  2. గ్రామ, వార్డు మహిళా పోలీసు,
  3. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ,
  4. వార్డు ఆడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ

36,449

12,54,034

కేటగిరీ-2(ఏ)

  1. ఇంజనీరింగ్ అసిస్టెంట్,
  2. వార్డు ఎమినిటీస్ సెక్రటరీ

14,759

1,33,811

కేటగిరీ-2 (బీ)

  1. వీఆర్పో,
  2. విలేజీ సర్వేయర్

14,038

1,55,168

కేటగిరీ-3

విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్

6,714

24,974

కేటగిరీ-3

విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్

4,000

12,586

కేటగిరీ-3

విలేజ్ ిఫిషరీస్ అసిస్టెంట్

794

15,234

కేటగిరీ-3

విలేజ్ డిజిటల్ అసిస్టెంట్

11,158

2,95,907

కేటగిరీ-3

పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్

9,886

6,265

కేటగిరీ-3

ఏఎన్‌ఎం లేదా వార్డు హెల్త్ సెక్రటరీ(ఫిమేల్)

13,540

72,581

కేటగిరి-3

విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్

400

5,047

కేటగిరీ-3

వార్డు ప్లానింగ్ రెగ్యులేషన్ సెక్రటరీ

3,770

13,909

కేటగిరీ-3

వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రటరీ

3,786

38,574

కేటగిరీ-3

వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ స్రెకటరీ

3,786

78,231

కేటగరీ-3

వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ

3,648

63,398

మొత్తం

1,26,728

21,69,719

Published on 8/13/2019 12:47:00 PM

సంబంధిత అంశాలు