దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఒకేసారి లక్షల సంఖ్యలో ఉద్యోగాల భర్తీని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టింది.
Edu newsపూర్తి పారదర్శకంగా, ఎలాంటి సిఫార్సులకు తావు లేకుండా రాతపరీక్ష ఆధారంగా ఈ ఉద్యోగాలకు మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేయాలని నిర్ణయించింది. అయితే, గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు దళారులు అభ్యర్థుల దగ్గర నుంచి వసూళ్లు ప్రారంభించినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని ముఖ్యమంత్రి కార్యాలయ(సీఎంవో) వర్గాలు తాజాగా స్పష్టం చేశాయి. ఆఖరికి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ ఉద్యోగాలు ఇప్పించలేరని తేల్చిచెప్పాయి. సిఫార్సులకు ఆస్కారం లేకుండా మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలను భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఇంటర్వ్యూలు పెట్టలేదని వెల్లడించాయి.

రాత పరీక్షలో మెరిట్ ఆధారంగానే...
గామ, వార్డు సచివాలయాల్లో 1,26,728 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. మరో 7,966 లైన్‌మెన్ ఉద్యోగాలకూ నోటిఫికేషన్ ఇచ్చింది. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగానే వీటిని భర్తీ చేయనున్నారు. దళారుల మాయమాటలకు మోసపోవద్దని సీఎంవో వర్గాలు సూచించాయి. అభ్యర్థులు అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపాయి. ఎలాంటి పొరపాట్లు, విమర్శలకు ఆస్కారం లేకుండా పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు, సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారని సీఎంవో వర్గాలు గుర్తుచేశాయి. డబ్బులు ముట్టజెబితే ఉద్యోగాలు రావనే విషయాన్ని అభ్యర్థులంతా గుర్తుంచుకోవాలని పేర్కొన్నాయి.
Published on 8/8/2019 3:34:00 PM

సంబంధిత అంశాలు