Facebook RSS for sakshiedu Twitter google+        
.:: ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకుంటున్నా- ఇంజనీరింగ్ 2వ ర్యాంకర్ ఎం.వి.బి. మనోజ్ కుమార్ ::.

ప్ర: ఎంసెట్‌లో టాప్ ర్యాంకర్‌గా నిలిచినందుకు మీరెలా ఫీలవుతున్నారు?
చాలా సంతోషంగా ఉంది. మొదటి ర్యాంకు వస్తుంది అనుకున్నాను. సెకెండ్ ర్యాంకు వచ్చింది.

ప్ర: మీ కుటుంబ నేపథ్యమేంటి?
మాది ఛత్తీస్‌గఢ్‌లోని సర్జాపూర్, అమ్మ, నాన్న మరణించారు. మామయ్య స్కూల్ టీచర్. విశాఖపట్నంలోనే చదువుకుంటున్నాను.

ప్ర: ఇంజనీరింగ్ ఏ క ళాశాలలో చేరాలనుకుంటున్నారు?
నాకు ఆల్‌ఇండియా ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్(ఏఐఈఈఈ)లో ఆల్‌ఇండియా 544వ ర్యాంకు వచ్చింది. తిరుచ్చి నిట్‌లో మెకానికల్ ఇంజనీరింగ్‌లో సీటు వచ్చింది. అక్కడే జాయిన్ అవుతాను.

ప్ర: ఎంసెట్‌తోపాటు ఇతర ప్రవేశ పరీక్షలు రాశారా?
ఏఐఈఈఈ రాసాను.

ప్ర: మీ అకడమిక్ రికార్డు చెప్పండి?
పదోతరగతి నవోదయా స్కూల్లో చదివాను. సీబీఎస్‌ఈ సిలబస్ చదివాను. 9.6 గ్రేడ్ వచ్చింది. ఇంటర్ విశాఖపట్నంలోని నారాయణ కాలేజీలో చదివాను. 976 మార్కులు వచ్చాయి.

ప్ర: ఓ వైపు ఇంటర్మీడియెట్ పరీక్షలకు ప్రిపేరవుతూనే ఎంసెట్‌కు ఎలాంటి ప్రిపరేషన్‌ను అనుసరించారు?
రెండు కలిసే పేరలాల్‌గా చదివాను. కాలేజీలో సంవత్సరం ప్రారంభంలోనే షెడ్యూల్ ఇస్తారు. దాన్ని కచ్చితంగా అమలు చేయాలి. ఏ రోజు చెప్పింది ఆరోజే చదువుకోవాలి.

ప్ర: కాలేజీలో బోధన, కోచింగ్ ఎంతవరకు ఉపకరించింది?
కాలేజీలో చెప్పిన అంశాలనే చదివాను. అదే నాకు చాలా ఉపయోగపడింది. కాలేజీలో అధ్యాపకులు వచ్చిన సందేహాలను వెంటనే తీరుస్తారు.

ప్ర: మీరు ప్రత్యేకంగా ఏవైనా బుక్స్ ప్రిపేరయ్యారా?
నారాయణ కాలేజీ మెటీరియల్ తప్ప ఎలాంటి పుస్తకాలు చదవలేదు.

ప్ర: అధ్యాపకులు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం?
ఇంట్లో మామయ్య వాళ్లు, కాలేజీలో లెక్చరర్స్ అందరూ బాగా ప్రోత్సహించేవారు.

ప్ర: భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారు?
ఇంజనీరింగ్ చేసిన తర్వాత సివిల్స్ రాసి ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకుంటున్నాను.

ప్ర: ఎంసెట్‌కు ప్రిపేరవుతున్న వారికి మీరిచ్చే సలహా?
అధ్యాపకులు చెప్పింది వినాలి. అయితే విన్నాం వదిలేసాం అని కాకుండా చెప్పిన దానిపై దష్టి పెట్టాలి. ఏకాగ్రతతో చదవాలి. అప్పుడు కచ్చితంగా విజయం సాధిస్తారు.
This page may require Adobe PDF Reader to view files. Click Here to Download
INTERMEDIATE LINKS
Related Topics..
 
SakshiEducation Home  |   Tenth Class  |   Engineering  |   Competitive Exams
About Us  |   Contact Us
Copyright © 2008 sakshi.com. All rights reserved.    Site is Best viewed in Internet Explorer 7 & above with 1024 × 768 Resolution